Gold Rate Today : బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో ..
- Harishth Thanniru
- Published On : January 15, 2024 / 07:36 AM IST
Gold
Gold And Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే, మీకు గుడ్ న్యూస్. బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్ర, శనివారాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆది, సోమవారాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 6గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,270గా నమోదైంది. వెండి ధరసైతం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 76,500గా నమోదైంది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,270గా నమోదైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,420 వద్ద కొనసాగుతుంది.
- ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,270 వద్ద కొనసాగుతుంది.
- చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.58,450 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,760గా నమోదైంది.
వెండి ధర ..
- దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సోమవారం వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
- ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,800 గా నమోదైంది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.76,500, బెంగళూరులో రూ.73,250 వద్ద కొనసాగుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
