Gold and silver Price: దీపావళికి ముందు బిగ్‌షాక్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 800 పెరిగింది.
- Harishth Thanniru
- Published On : October 18, 2024 / 11:08 AM IST
Gold And Silver Price Today
Gold And Silver Price Today: బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధర గత మూడు రోజులుగా భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 870 పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1580 పెరిగింది. వెండి ధరసైతం శుక్రవారం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరల నేపథ్యంలో.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 800 పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,400కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.78,980కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,550 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 79,130.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.72,400 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.78,980.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,400 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.78,980కు చేరింది.
వెండి ధర ఇలా ..
శుక్రవారం వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,05,000 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,05,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ.99,000.
బెంగళూరులో కిలో వెండిపై రూ. 100 మాత్రమే పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర 94,100 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
