Gold Price Today: 2024 సంవత్సరం తొలిరోజు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
- Harishth Thanniru
- Published On : January 1, 2024 / 11:38 AM IST
Gold Price
Gold And Silver Prices Today : 2023 సంవత్సరం ముగిసింది.. దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. 2024 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. 2023 సంవత్సరంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 2024 సంవత్సరంలోనూ బంగారం, వెండి ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, 2024 సంవత్సరం తొలిరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 58,550కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం 63,870 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కిలో వెండి ధర 80వేల వద్ద కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,550కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 63,870 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,970.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,870 మార్క్ తాకింది.
– చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.59,100కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.64,470గా నమోదైంది.
వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సోమవారం వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,700 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,700. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.78,300కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.76,000 వద్ద కొనసాగుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
