Gold and silver Price: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : October 20, 2024 / 09:43 AM IST
Gold
Gold And Silver Price Today: గత నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే, ఆదివారం వీటి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 79,420 వద్ద కొనసాగుతుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ నమోదైన బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,800కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.79,420 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,930 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 79,570.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.72,800 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.79,420.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,800 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.79,420 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
ఆదివారం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,07,100 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,07,100.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ.99,500.
బెంగళూరులో కిలో వెండి ధర 97,000 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
