Gold and silver Price: బాబోయ్.. ఆరు రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : October 21, 2024 / 11:47 AM IST
Gold
Gold And Silver Price Today: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం నమోదైన వివరాల ప్రకారం.. ఇవాళ కూడా బంగారం, వెండి ధర పెరిగింది. గడిచిన ఆరు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 2, 240 పెరిగింది. వెండి ధరసైతం భారీగా పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ నమోదైన బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 220 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 200 పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.79,640 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,150 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 79,790.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.73,000 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.79,640.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,000 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.79,640 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
సోమవారం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,09,000 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,09,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,01,000.
బెంగళూరులో కిలో వెండి ధర 97,000 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
