Gold Price Today : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
- Harishth Thanniru
- Published On : November 24, 2023 / 07:25 AM IST
Gold
Today Gold and Silver Rate : బంగారం ధర స్వల్పంగా తగ్గింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తులం బంగారంపై రూ. 50 తగ్గింది. మరోవైపు గురువారం వెండి ధర భారీగా తగ్గగా.. శుక్రవారం స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ. 200 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 56,800 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 61,970 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 61,970.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970కు చేరింది.
– చెన్నైలో గోల్డ్ ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 50 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,350 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.62,550కు చేరింది.
స్థిరంగా వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 200 పెరిగింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,200కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,200. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.76,200 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. 400 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.75,000 కు చేరింది.
