Gold and silver Price: స్వల్ప ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : October 25, 2024 / 11:23 AM IST
Gold
Gold And Silver Price Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలన్న ఆలోచన వస్తేనే వాటి ధరలు దడపుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గత పది రోజులుగా వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగినప్పటికీ.. వెండి ధర భారీగా తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ నమోదైన బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,950కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.79,580 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,100 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 79,730.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.72,950 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 79,580.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,950 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.79,580 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
శుక్రవారం వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,07,000 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,07,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ. 98,000.
బెంగళూరులో కిలో వెండి ధర 98,000 వద్దకు చేరింది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
