Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతో తెలుసా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
- Harishth Thanniru
- Updated on- November 27, 2023 / 09:21 AM IST
Gold Price
Today Gold and Silver Rate : పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరసైతం అదే స్థాయిలో పెరుగుతూ కొనుగోలుదారులకు షాకిస్తుంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. శనివారం స్థిరంగా కొనసాగిన గోల్డ్ ధర.. ఆదివారం పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తులం బంగారంపై రూ. 300 పెరిగింది. అదేవిధంగా వెండిధర సైతం పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 57,100 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 62,290 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,440.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,290కు చేరింది.
– చెన్నైలో గోల్డ్ ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 250, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంపై 280 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,550 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.62,780కు చేరింది.
స్థిరంగా వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,200కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,200. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.77,200 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.76,250 కు చేరింది.
