Gold and silver Price: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర
- Harishth Thanniru
- Published On : October 26, 2024 / 10:32 AM IST
Gold
Gold And Silver Price Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలన్న ఆలోచన వస్తేనే వాటి ధరలు దడపుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గత పది రోజులుగా వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. శనివారంకూడా బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 710 పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ నమోదైన బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,600కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.80,290 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 80,440.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.73,600 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 80,290.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,600 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.80,290 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
శనివారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,07,000 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,07,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ. 98,000.
బెంగళూరులో కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర 99,000 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
