Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు షాకిస్తున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
- Harishth Thanniru
- Updated on- December 27, 2023 / 12:12 PM IST
Gold Price
Gold And Silver Prices Today : బంగారం ధర పరుగులు పెడుతోంది. రికార్డు స్థాయి ధరవైపు దూసుకెళ్తోంది. గడిచిన పదిరోజుల్లో తులం బంగారంపై సుమారు రూ. 1200 పెరిగింది. రానున్నరోజుల్లోనూ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అదేజరిగితే 22 క్యారెట్ల తులం బంగారం రూ. 60వేల మార్కును చేరే అవకాశాలున్నాయి. బుధారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 200 పెరగ్గా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరిగింది. వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 300 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధర ఇలా ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,400కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 63,710 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా కడపలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,820 గా ఉంది. పొద్దుటూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,164 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,498 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,860.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,710 మార్క్ తాకింది.
– చెన్నైలో గోల్డ్ ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.160 పెరిగింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,950కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.64,310గా నమోదైంది.
పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బుధవారం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ.200 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 81,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.79,500కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.76,750 వద్ద కొనసాగుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
