Gold Rate : ఇలా అయితే బంగారం కొనేదెలా..? తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా..

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold

Gold And Silver Price Today : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారంలో భారీగా తగ్గిన గోల్డ్ రేటు సోమవారం నుంచి మళ్లీ పెరుగుతూ వస్తోంది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరిగింది. దీంతో గత మూడు రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 660 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరుగుతోంది. ఇవాళ ఉదయం కిలో వెండిపై రూ. 1200 పెరిగింది. మూడు రోజుల్లో కిలో వెండిపై రూ.6,200 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,02,200 కు చేరింది. తగ్గినట్లేతగ్గి మళ్లీ బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండటంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అంటూ కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,200.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,250 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,350.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,100 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,200.
    చెన్నైలో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 380 పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 350 పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,750 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.73,910.

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,02200.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ.1,02,200.
    కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.97,700.
    బెంగళూరులో కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 95,250 వద్దకు చేరింది.

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు