Car Mileage Tips : మీ కారు మైలేజీ తగ్గిందా? అందరూ చేసే 5 మిస్టేక్స్ ఇవే.. ఇలా చేస్తే మీ ప్రతి పైసా సేవ్ అయినట్టే..!
Car Mileage : కారు మైలేజీ ఎందుకు తగ్గుతుందో తెలుసా? తక్కువ మైలేజీ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు.. అదేంటో మీరు గుర్తుంచి వెంటనే క్లియర్ చేయండి.. మీ డబ్బులు ఖర్చు కావు.
Car Mileage Drop
Car Mileage Tips : మీ కారు మైలేజీ తగ్గిందా? చాలామందికి ఇదే సమస్య ఉంటుంది. సాధారణంగా కారు మైలేజీ తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. తక్కువ మైలేజ్ ఉన్న కారులో పెద్ద సమస్యను సృష్టిస్తుంది. కానీ ఎల్లప్పుడూ అలా ఉండదు. కొన్నిసార్లు, చిన్న తప్పులు లేదా ముఖ్యమైన (Car Mileage Tips) విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల కారు మైలేజ్ తగ్గుతుంది. మీ కారు మైలేజీని మెరుగుపర్చడానికి ఈ 5 విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మైలేజీ తగ్గడానికి కారణాలు ముందే తెలుసుకుంటే ప్రతి నెలా వేల రూపాయలు ఆదా చేయొచ్చు.
డ్రైవింగ్ అలవాట్లు :
చాలామంది వాహనదారులు తమ కారులో మైలేజీ తక్కువగా ఉంటే.. కారు ఇంజిన్‌లో ఏదో సమస్య ఉందని భావిస్తారు. కానీ, డ్రైవింగ్ అలవాట్లను విస్మరిస్తారు. వాస్తవానికి, డ్రైవింగ్ చేసే విధానం కూడా మైలేజీపై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మీరు కారును అధిక వేగంతో నడిపితే అధిక మైలేజీని అసలు ఇస్తుందని అనుకుంటారు.
అతి వేగం హార్డ్ బ్రేకింగ్ ఇంజిన్‌పై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఎక్కువ ఫ్యూయిల్ వినియోగించుకుంటుంది. ట్రాఫిక్‌లో లేదా సిగ్నల్స్ వద్ద ఇంజిన్‌ను ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల ఫ్యూయిల్ వృధాకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీ డ్రైవింగ్ మెథడ్స్ మెరుగుపరచడం ద్వారా మెరుగైన మైలేజీని పొందవచ్చు.
టైర్లలో తక్కువ గాలి :
టైర్లలో గాలి పీడనం తక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వాహనం సగటు మైలేజీ తగ్గుతుంది. టైర్లలో గాలి పీడనం తక్కువగా ఉన్నప్పటికీ తరచుగా ఈ వాస్తవాన్ని విస్మరిస్తుంటారు. అలానే డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. వాస్తవానికి టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు రోడ్డుతో టైర్ కాంటాక్ట్ ఏరియా పెరుగుతుంది.
దీని కారణంగా, వాహనం ముందుకు కదలడానికి ఎక్కువ పవర్ వినియోగించుకుంటుంది. దీనినే రోలింగ్ రెసిస్టెన్స్ అంటారు. రోలింగ్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇంధన వినియోగం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీ కార్లలో టైర్ ఎయిర్ ప్రెజర్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో అనేక వాహనాల్లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) అందుబాటులో ఉంది.
పాత ఇంజిన్ ఆయిల్ :
కారులోని ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ పాతబడితే మైలేజీని తగ్గేలా చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ అనేది ఇంజిన్ పార్టులను లూబ్రికేట్ చేస్తుంది. వాటి మధ్య ఘర్షణను తగ్గిస్తుంది. కాలక్రమేణా, ఇంజిన్ ఆయిల్ లూబ్రికేషన్‌ను కోల్పోయి మురికిగా మారుతుంది. ఇంజిన్ భాగాల మధ్య ఘర్షణను పెంచుతుంది. ఇంజిన్ మీద మరింత ప్రెజర్ పెంచుతుంది. అందుకే, ఇంజిన్ ఆయిల్‌ను సకాలంలో మార్చడం అత్యంత ముఖ్యం.
డర్టీ ఎయిర్ ఫిల్టర్ :
డర్టీ ఎయిర్ ఫిల్టర్ కూడా మైలేజీని తగ్గేలా చేస్తుంది. ఎయిర్ ఫిల్టర్ డర్టీ లేదా క్లోజ్ ఇంజిన్ తగినంత క్లియర్ ఎయిర్ అందుకోదు. ఇంజిన్ ఎక్కువ ఫ్యూయిల్ వినియోగిస్తుంది. మైలేజీని తగ్గించడమే కాకుండా ఇంజిన్ పర్ఫార్మెన్స్ దెబ్బతీస్తుంది. కాలుష్యాన్ని పెంచుతుంది. అందుకే సర్వీస్ సమయంలో ఎయిర్ ఫిల్టర్‌ను ఎల్లప్పుడూ చెక్ చేయండి. అవసరమైతే రిప్లేస్ చేయండి.
స్పార్క్ ప్లగ్ ఫెయిల్యూర్ :
కారు నడిపినప్పుడు అందులోని పార్టులు కూడా కాలక్రమేణా అరిగిపోతాయి. కారు మైలేజీ తగ్గడానికి ప్రధాన కారణం స్పార్క్ ప్లగ్‌లోని లోపం. స్పార్క్ ప్లగ్ అనేది ఇంజిన్ సిలిండర్‌లోని ఫ్యూయిల్, ఎయిర్ మిశ్రమాన్ని మండిస్తుంది.
స్పార్క్ ప్లగ్‌లు పాతబడినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు అవి సరైన సమయంలో తగినంత మొత్తంలో స్పార్క్‌ను జనరేట్ చేయలేవు. తద్వారా ఇంజిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మైలేజీ కూడా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితిలో సర్వీస్ సమయంలో స్పార్క్ ప్లగ్‌లను చెక్ చేయడం, క్రమం తప్పకుండా మార్చడం చాలా ముఖ్యమని గమనించాలి.
