Redmi Note 14 Pro Plus : రెడ్‌మి ఫ్యాన్స్ డోంట్ మిస్.. ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?
Redmi Note 14 Pro Plus : కొత్త రెడ్‌మి ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఏకంగా రూ.9 వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Redmi Note 14 Pro Plus : కొత్త రెడ్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధర రూ.34,999గా ఉండగా ఇప్పుడు రూ.25,499కి అమ్ముడవుతోంది. అయితే, ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్ కార్డులతో ధరను రూ.21,499కి తగ్గించవచ్చు.

అంతేకాదు.. ఈ-కామర్స్ బ్రాండ్ కేవలం రూ.897 నుంచి ఈఎంఐ ప్లాన్లను కూడా అందిస్తోంది. రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5K OLED స్క్రీన్ కలిగి ఉంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ డీల్ : గతంలో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర రూ. 34,999 ఉండగా రూ. 25,499 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 4వేల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా ధర రూ. 21,499కి తగ్గుతుంది. అదనంగా, వినియోగదారులు రూ. 897 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు : రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్ 6.67-అంగుళాల 1.5K OLED స్క్రీన్ కలర్‌ఫుల్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది.

ఈ రెడ్‌మి ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoCతో 12GB వరకు ర్యామ్, 512GB భారీ స్టోరేజీ కెపాసిటీని కలిగి ఉంది. ఈ రెడ్‌మి ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,200mAh భారీ బ్యాటరీని అందిస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

కెమెరాల విషయానికొస్తే.. ఈ రెడ్‌మి 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. IP66 + IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కెపాసిటీకి కూడా సపోర్టు ఇస్తుంది.
