Gold Price Today: బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి అవకాశమా? తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎతంటే?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..
- Harishth Thanniru
- Published On : January 2, 2024 / 07:33 AM IST
Gold Price Today
Gold And Silver Prices Today : 2023 సంవత్సరం ముగిసింది.. గతేడాది బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 2023 సంవత్సరం ప్రారంభంలో గ్రాము మేలిమి బంగారం ధర రూ. 5,425 ఉంది. డిసెంబర్ నెల వచ్చే సరికి గ్రాము మేలిమి బంగారం ధర రూ. 6,540కు చేరింది. అంటే గ్రాముకు రూ. 1100 పెరిగింది. 2024 సంవత్సరంలో అంతర్జాతీయంగా ఔన్సు ప్రస్తుత 2075 డాలర్ల నుంచి 2300 డాలర్లకు చేరితే.. దేశీయంగా బంగారం గ్రాము ధర రూ. 7,100కు చేరే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువగానూ బంగారం ధరలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధరలుసైతం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణుల అంచనా. గత ఏడాది కిలో వెండి రూ. 60వేల నుంచి రూ. 75వేలకు చేరింది. 2024లో కిలో వెండి 90వేలకు చేరొచ్చన్నది అంచనా.
2024 సంవత్సరంలో రెండోరోజూ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో బంగారం కొనుగోలుకు ఇదే మంచి అవకాశమని పలువురు పేర్కొంటున్నారు. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 58,550కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం 63,870 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కిలో వెండి ధర 80వేల వద్ద కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,550కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 63,870 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,970.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,870 మార్క్ తాకింది.
– చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.59,100కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.64,470గా నమోదైంది.
వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మంగళవారం వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,700 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,700. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.78,300కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.76,000 వద్ద కొనసాగుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
