Gold Price: దీపావళి రోజున తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : October 31, 2024 / 11:28 AM IST
Gold
Gold and Silver Price Today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీపావళి పండుగ రోజుకూడా బంగారం ధర పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.150 పెరగగా.. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఓసారి తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,550కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.81,330 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,700 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 81,480.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.74,550 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 81,330.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,550 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 81,330 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
గురువారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,09,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,09,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ. 1,00,000.
బెంగళూరులో కిలో వెండి ధర 1,00,000 కు చేరింది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
