Dhanteras 2026 : ధన్తేరస్ వేళ బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ డిజిటల్ గోల్డ్ ఆఫర్లు మిస్ కావద్దు!
Dhanteras 2026 : ధంతేరస్ 2026 సందర్భంగా PhonePe, JUMPP, BharatPe, TickerTape డిజిటల్ గోల్డ్ ఆఫర్లు ప్రకటించాయి. 5శాతం అదనపు బంగారం, రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్, రూ.500 విలువైన ఉచిత గోల్డ్ పొందవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Best Digital Gold Offers on PhonePe, BharatPe
- పసిడి ప్రియులకు పండగే.. PhonePe, BharatPeలో డిజిటల్ గోల్డ్ డీల్స్
- తక్కువ మొత్తంతో బంగారం కొనొచ్చు.. ధన్తేరస్ 2026 స్పెషల్ ఆఫర్లు
- బంగారం కోసం నో షాపింగ్.. యాప్స్‌లోనే అదిరిపోయే ఆఫర్లు
Dhanteras 2026 : ధంతేరస్ వచ్చేస్తోంది.. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈసారి షాపులకు వెళ్లకుండానే డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేస్తే అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. ఎందుకంటే.. 2026 ధంతేరస్ సందర్భంగా PhonePe, JUMPP, BharatPe, TickerTape వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించాయి. క్యాష్‌బ్యాక్‌తో పాటు ఫ్రీగా అదనపు బంగారం పొందే అవకాశం కల్పిస్తున్నాయి. మరి ఏ ప్లాట్ఫామ్లో ఎంత లాభం ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫోన్ పే (PhonePe) :
ఈ ఫోన్ పే ద్వారా 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేస్తే.. 2 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. గరిష్ఠంగా రూ.2వేల వరకు పొందవచ్చు. అయితే, కనీసం రూ.2వేలు కొనుగోలు చేయాలి. ఒకేసారి చేసే కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. నవంబర్ 6, 2026 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఒక్క యూజర్ ఒకసారి మాత్రమే పొందగలరు. గోల్డ్ SIPలకు ఈ ఆఫర్ వర్తించదు..
జంప్ (JUMPP) :
ఈ యాప్ ద్వారా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రూ.2,100 లేదా ఆపై విలువైన ప్రతి అర్హత ఉన్న లావాదేవీపై రూ.21 విలువైన డిజిటల్ గోల్డ్ లభిస్తుంది. రోజుకు రెండు లావాదేవీల వరకు మొత్తం రూ.42 విలువైన బంగారాన్ని పొందవచ్చు.
భారత్ పే (BharatPe) :
భారత్ పే యాప్ ద్వారా రూ.100 దాటిన అర్హత కలిగిన కొనుగోళ్లపై 5 శాతం అదనపు డిజిటల్ గోల్డ్ అందిస్తోంది. ఈ బంగారం నేరుగా కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో క్రెడిట్ అవుతుంది. అంతేకాదు, రూ.20 లక్షల ప్రైజ్ పూల్తో లీడర్‌బోర్డ్ పోటీ కూడా నిర్వహిస్తోంది. నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
టిక్కర్ టేప్ (TickerTape) :
ఈ యాప్ లో రూ.5వేలు పెట్టుబడిపై రూ.200, రూ.7వేలు పెట్టుబడిపై రూ.300, రూ.10వేల పెట్టుబడిపై రూ.500 విలువైన అదనపు డిజిటల్ గోల్డ్ పొందవచ్చు. నవంబర్ 6లోపు పెట్టుబడి పూర్తి చేయాలి. ఈ ఆఫర్ మొదటి వెయ్యి మంది అర్హులైన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఆఫర్లు, అర్హతలు, నిబంధనలు ప్లాట్‌ఫామ్‌ను బట్టి మారవచ్చు. కొనుగోలు చేసే ముందు పూర్తి నిబంధనలు చెక్ చేసిన తర్వాత కొనుగోలు చేయడం మంచిది..
