Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : December 6, 2024 / 10:23 AM IST
Gold
Gold And Silver Price: దేశవ్యాప్తంగా గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర దూకుడుకు బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం ధర తగ్గింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 270 తగ్గింది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,150కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.77,620 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,300 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 77,770.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.71,150 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.77,620.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,150 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 77,620 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా శుక్రవారం వెండి ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,01,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,01,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి ధర రూ. 92,000.
బెంగళూరులో కిలో వెండి ధర 92,000 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
