Gold Rate Today : నేటి బంగారం, వెండి ధరలు ఇవే.. రాత్రికిరాత్రే భారీ మార్పు.. 2026లో గోల్డ్ రేటు ఎంత పెరుగుతుందో తెలుసా..?
Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర
- Harishth Thanniru
- Published On : December 8, 2025 / 10:52 AM IST
Gold Rate Today
Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తగ్గినట్లే తగ్గుతున్న ధరలు.. మళ్లీ అమాంతం పెరుగుతున్నాయి. అంతర్జాతయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వీటి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.270 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 12డాలర్లు పెరింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,208 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధరసైతం సోమవారం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.2,100 పెరిగింది. తద్వారా కిలో వెండి రేటు రూ.1.98లక్షలకు చేరుకుంది.
నిపుణుల అంచనా ప్రకారం.. వచ్చే ఏడాది (2026)లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం తీవ్రతపై ఆధారపడి ప్రస్తుత స్థాయి నుంచి 5 నుంచి 15శాతం బంగారం ధరలు పెరిగే చాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డబ్ల్యూజీసీ ప్రకారం.. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్‌పై 4వేల డాలర్ల నుంచి 4,500 డాలర్ల మధ్య స్థిరపడొచ్చునని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,19,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,30,420కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,700 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,30,570కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,19,700 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,30,570కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,98,900 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,89,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,98,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
