Gold Silver Price Today: పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే!
అంతర్జాతీయ ద్రవ్యోల్బణ పరిస్థితులు, రూపాయి మారకం విలువ ఆధారంగా బులియన్ మార్కెట్లో పసిడి (Gold Silver Price Today)రేట్లలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి.
- V Santhosh Kumar
- Published on- September 1, 2026 / 10:14 AM IST
Gold And Silver Rate Today 1st september 2026 In Hyderabad Visakhapatnam Full Details
- స్థిరంగా ముగిసిన బంగారం ధరలు
- తెలుగు రాష్ట్రాల్లో మారని రేట్లు
- హైదరాబాద్‌లో స్థిరమైన పసిడి
Gold Silver Price Today: దేశీయంగా బంగారం ధరల్లో నిరంతరం హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు బంగారం మార్కెట్ పరిణామాలు ఎంతో కీలకంగ మారాయి. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ పరిస్థితులు, రూపాయి మారకం విలువ ఆధారంగా బులియన్ మార్కెట్లో పసిడి(Gold Silver Price Today) రేట్లలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చితే స్థిరంగా ముగిసి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం కలిగించాయి.
Nepal Floods: నేపాల్ కు మళ్ళీ ముప్పు.. భోటికోసి నదికి వరద ఉధృతి.. చైనా నుంచి రెడ్ అలర్ట్
నిన్నటితో పోల్చితే ఎంత తేడా ఉందంటే?
నిన్నటి మార్కెట్ రేట్లతో పోల్చి చూస్తే ఈరోజు బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరమైన సరళి నమోదు అయింది. ప్రతి 10 గ్రాముల (తులం) బంగారం ధర నిన్నటి స్థాయిలోనే కొనసాగుతోంది. అంతర్జాతీయంగా డాలర్ వ్యాల్యూ, క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం స్థిరంగా ఉండటంతో బులియన్ మార్కెట్‌లో ధరలు నిలకడగా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు – హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బంగారం ధరలు ఒకే రీతిలో కొనసాగుతున్నాయి. భాగ్యనగరం హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ప్రస్తుతం రూ.1,43,710 వద్ద విక్రయమవుతోంది. అలాగే 24 క్యారెట్ల (మేలిమి) తులం బంగారం ధర రూ.1,56,770 వద్ద స్థిరంగా పలికింది. వినాయక చవితి, పండుగల సీజన్ దగ్గర పడుతుండటంతో బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది.
