Nepal Floods: నేపాల్ కు మళ్ళీ ముప్పు.. భోటికోసి నదికి వరద ఉధృతి.. చైనా నుంచి రెడ్ అలర్ట్
భోటికోసి నదిలో నీటిమట్టం మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో చైనా అధికారులు మరోసారి వరద(Nepal Floods) హెచ్చరికలు జారీ చేశారు.
China has issued warnings regarding a looming threat to Nepal
- నేపాల్ కు పొంచిఉన్న మరో ముప్పు
- భోటికోసి నదిలో పెరిగిన వరదలు
- ముందస్తు హెచ్చరికలు జారీ
Nepal Floods: నేపాల్, టిబెట్ సరిహద్దు హిమాలయాల్లో సంభవించిన అకస్మాత్తు వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. నేపాల్ జాతీయ విపత్తు ప్రాధికార సంస్థ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 903 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 5,000 మందికి పైగా జాడ తెలియకుండా పోయారు. గల్లంతైన వారిలో 582 మంది విదేశీయులతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వర్షాలు, దెబ్బతిన్న రోడ్లు సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగిస్తుండటంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.
Anna Hazare: సామాజిక కార్యకర్త ‘అన్నా హజారే’కు తీవ్ర అస్వస్థత.. ముంబై ఆసుపత్రికి తరలింపు
పెరిగిన భోటికోసి నీటిమట్టం – చైనా నుంచి మళ్లీ వరద హెచ్చరికలు:
భోటికోసి నదిలో నీటిమట్టం మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో చైనా అధికారులు మరోసారి వరద (Nepal Floods)హెచ్చరికలు జారీ చేశారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రసువాగఢ్, చైనా సరిహద్దు రహదారులు పలుచోట్ల కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఖాట్మండు సహా వివిధ ప్రాంతాల్లోని త్రిశూలి, చిలిమే జలవిద్యుత్ సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం నేపాల్ సైన్యంతో కలసి భారత సొరంగ రక్షణ బృందం ముమ్మరంగా వెతుకుతోంది.
కుళ్లిపోతున్న మృతదేహాలు – వేగంగా సామూహిక అంత్యక్రియలు:
వరద ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు చిత్వన్, నవల్పరాసి తదితర జిల్లాల్లో బయటపడుతున్నాయి. నీటిలో ఎక్కువ రోజులు ఉండటంతో మృతదేహాలు కుళ్లిపోయే దశకు చేరుకోవడంతో అధికారులు వేగంగా సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతులను గుర్తించేందుకు వీలుగా డీఎన్ఏ (DNA) పరీక్షలు నిర్వహిస్తున్నారు. టిబెట్ వైపు కూడా 16 మంది మరణించగా, 546 మంది గల్లంతయ్యారు. బాధితుల సంఖ్య 90 వేలు దాటడంతో రెండు దేశాల సరిహద్దుల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
