Anna Hazare: సామాజిక కార్యకర్త ‘అన్నా హజారే’కు తీవ్ర అస్వస్థత.. ముంబై ఆసుపత్రికి తరలింపు
ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే (Anna Hazare)తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Social activist anna hazare admitted to mumbai hospital icu health condition critical
- అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత
- ముంబై ఆసుపత్రి ఐసీయూలో చికిత్స
- క్షీణించిన ఆరోగ్యంపై వైద్యుల పర్యవేక్షణ
Anna Hazare: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 89 ఏళ్ల వయసున్న ఆయన వైరల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత సమస్యలు మరియు తీవ్రమైన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. మొదట మహారాష్ట్ర రాలేగావ్ సిద్ధిలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ప్రముఖ బాంబే ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ గౌతమ్ భన్సాలీ పర్యవేక్షణలో ఐసీయూలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తుండగా, త్వరలోనే హెల్త్ బులెటిన్ విడుదల కానుంది.
అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు – 22 సార్లు నిరాహార దీక్షలు:
అహింసా మార్గంలో సత్యాగ్రహాలు చేస్తూ అన్నా హజారే (Anna Hazare)దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఆయన 22 సార్లు నిరాహార దీక్షలు చేపట్టగా, 2011లో అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి చేపట్టిన ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ (IAC) ఉద్యమం, జనలోక్‌పాల్ బిల్లు పోరాటం దేశంలో సంచలనం సృష్టించాయి. ఇటీవలి కాలంలోనూ రైతు చట్టాలు, నీట్ పరీక్షల వివాదంపై స్పందించిన ఆయన విద్యార్థులకు మద్దతుగా మౌన దీక్ష కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, నేతలు ప్రార్థిస్తున్నారు.
