Ganesh Idol Prices Hike: వినాయక చవితి వేళ షాకింగ్ న్యూస్.. ఆకాశాన్నంటుతున్న గణనాథుల ధరలు.. 20 అడుగుల విగ్రహం లక్ష పైనే!
ఈ ఏడాది గణనాథుని(Ganesh Idol Prices Hike) విగ్రహాల ధరలు భారీగా పెరగనుండటంతో భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ధరల భారం తప్పేలా లేదు.
Ganesh chaturthi 2026 ganesha idol prices hike
- గణపతి విగ్రహాల ధరలు పెంపు
- ముడిసరుకులు, రవాణా భారం అధికం
- ఈసారి ఇరవైశాతం రేట్లు పెరుగుదల
Ganesh Idol Prices Hike: వినాయక చవితి పండగ సమీపిస్తుండటంతో భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల సందడి అప్పుడే మొదలైంది. హైదరాబాద్ నగరంలతో పాటు శివారు ప్రాంతాల్లో విగ్రహాల తయారీ పనులు తుదిమెరుగులకు చేరుకున్నాయి. అయితే ఈ ఏడాది గణనాథుని విగ్రహాల ధరలు భారీగా పెరగనుండటంతో భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ధరల భారం తప్పేలా లేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి విగ్రహాల రేట్లు దాదాపు 25 శాతం వరకు పెరిగినట్లు తయారీదారులు స్పష్టం చేస్తున్నారు.
PMAY-U: ఏపీ పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. సొంతింటి కోసం రూ.2.89 లక్షల సాయం.. డైరెక్ట్ అకౌంట్ లోకే
ముడిసరుకులు, రవాణా భారం – పెరిగిన విగ్రహాల రేట్లు:
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), కొబ్బరిపీచు, రంగులు, అలంకరణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడమే కాకుండా రవాణా ఛార్జీలు కూడా భారంగా మారాయని తయారీదారులు వెల్లడించారు. గతేడాది 20 అడుగుల విగ్రహం ధర(Ganesh Idol Prices Hike) రూ.85 వేలు ఉండగా, ఈసారి అది రూ.లక్ష దాటింది. అలాగే సాధారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేసే 12 నుండి 16 అడుగుల విగ్రహాల ధరలు గతంలో రూ.50-60 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.70 నుండి 80 వేల వరకు పలుకుతున్నాయి.
ఎవర్ గ్రీన్ ధూల్‌పేట్ – శివార్లకు విస్తరించిన వ్యాపారం:
నగరంలో వినాయక విగ్రహాల తయారీ అనగానే మొదట గుర్తుకొచ్చే ధూల్‌పేట్‌తో పాటు నాగోలు, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ధూల్‌పేట్ విగ్రహాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా విశేషమైన డిమాండ్ ఉంది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలను దిగుమతి చేసుకుని విక్రయిస్తుండటంతో మార్కెట్లో పోటీ బాగా పెరిగింది.
కొత్త రకాల ఆకృతులు – రూ.1.5 లక్షల వరకు భారీ విగ్రహాలు
భక్తుల మదిని దోచేలా వివిధ భంగిమలు, చక్కటి వర్ణాలతో విగ్రహాలను కళాకారులు సిద్ధం చేశారు. విగ్రహాల బరువు తగ్గించడానికి, మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఫైబర్ పదార్థాలను వినియోగిస్తున్నారు. డిజైన్లు, ఫైబర్ హంగులు, అలంకరణల ప్రాతిపదికన 20 నుండి 30 అడుగుల భారీ విగ్రహాల ధరలు రూ.లక్ష నుండి రూ.1.50 లక్షల వరకు పలుకుతున్నాయని ధూల్‌పేట్ నిపుణులు తెలిపారు.
