Gold Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కొనుగోలుదారులకు మంచి అవకాశం.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?

పసిడి(Gold Silver Price Today) కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Gold And Silver Rates Today 13 September 2026 In Hyderabad Visakhapatnam Full Details

  • స్థిరంగా ముగిసిన బంగారం ధరలు
  • భాగ్యనగరంలో మారని పసిడి రేట్లు
  • కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశం

Gold Silver Price Today: దేశవ్యాప్తంగా పసిడి ప్రియులకు, పెట్టుబడిదారులకు ఊరటనిస్తూ ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న మార్పులు, డాలర్ విలువలో వ్యత్యాసాల కారణంగా ఇటీవల హెచ్చుతగ్గులకు గురైన పసిడి ధరలు, శనివారం నాటి ముగింపుతో పోలిస్తే ఈరోజు మార్కెట్‌లో పెద్దగా మార్పు లేకుండా యథాతథంగా కొనసాగుతున్నాయి. పసిడి కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Janasena Telangana Sankharavam: నేడే ఖమ్మంలో జనసేన ‘తెలంగాణ శంఖారావం’ సభ.. భారీగా తరలివస్తున్న జనసైనికులు

తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు:

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి(Gold Silver Price Today) రేట్లు ఒకే విధంగా నమోదు నమోదయ్యాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 1,41,700 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి తులం ధర రూ. 1,54,580 వద్ద స్థిరపడింది.

హైదరాబాద్‌లో పసిడి రేట్లు:

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు మార్పు లేకుండా పసిడి ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. భాగ్యనగరంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,41,700 వద్ద పసందుగా నమోదు కాగా, 24 క్యారెట్ల తులం మేలిమి బంగారం ధర రూ. 1,54,580 గా పలకడం గమనార్హం. స్థానిక పన్నులు, తయారీ ఛార్జీల (మేకింగ్ ఛార్జెస్) ఆధారంగా వివిధ జ్యువెలరీ షోరూమ్‌లలో ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశముంది.