Gold Price Today : బంగారం ధరలో భారీ మార్పులు.. వెండి ధర ఢమాల్.. ఒక్కరోజే రూ.12వేలు తగ్గుదల..
Gold Price Today : బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కరోజులోనే రూ.12వేలు తగ్గింది.
- Harishth Thanniru
- Published On : November 21, 2025 / 11:02 AM IST
Gold Price Today
Gold Price Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గురువారం 24 క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ. 550 తగ్గగా.. ఇవాళ పెరిగింది. మరోవైపు వెండి రేటు భారీగా తగ్గింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 220 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 200 పెరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 6డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,055 డాలర్లు వద్ద కొనసాగుతుంది.
మరోవైపు వెండి రేటు భారీగా తగ్గింది. గురువారం కిలో వెండిపై రూ.3వేలు తగ్గగా.. శుక్రవారం కిలో వెండిపై రూ.12వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,14,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,24,480కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,250కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,24,630కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,14,100 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,24,480కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,61,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,61,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,61,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
Also Read : కుక్క కాటుతో చనిపోతే రూ.5లక్షలు.. గాయపడితే రూ.5వేలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
