Gold Rate Today : పండుగ వేళ గోల్డ్ ప్రియులకు భారీ శుభవార్త.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. వరుసగా రెండోరోజు పడిపోయిన రేటు..
Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర భారీగా తగ్గింది.
- Harishth Thanniru
- Published On : September 25, 2025 / 10:31 AM IST
Gold Rate Today
Gold Rate Today : దసరా పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే మీకు భారీ శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. గత కొద్దిరోజులుగా అకాశమే హద్దుగా దూసుకెళ్తున్న గోల్డ్ రేటుకు.. బుధ, గురువారాల్లో వరుసగా బ్రేకులు పడ్డాయి.
బుధవారం 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 320 తగ్గగా.. గురువారంసైతం బంగారం ధర భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.930 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ.850 తగ్గింది.అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. అక్కడ ఔన్సు గోల్డ్ నాలుగు డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,738 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గత రెండు రోజులుగా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,04,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,14,400కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,14,590కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,04,400 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,14,400కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,50,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,50,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
