Gold Price Today : బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్, తగ్గిన ధరలు
కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి.
- Naveen
- Published On : August 30, 2021 / 05:06 PM IST
Gold Price Today
Gold Price Today : కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. పసిడి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి.
తాజాగా బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.199 తగ్గి రూ.46,389కి చేరింది. క్రితం ట్రేడ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,588 దగ్గర ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధర స్వల్పంగా తగ్గడం, ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ కాస్త బలపడటం దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.250 తగ్గి రూ.62,063కు చేరింది. క్రితం ట్రేడ్ లో కిలో వెండి ధర రూ.62,313 దగ్గర ముగిసింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ ఇవాళ 31 పైసలు బలపడి రూ.73.38కి చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,814 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.99 అమెరికన్ డాలర్లు పలికింది.
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. పుత్తడిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇక భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం ఆపరు.
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
