Gold Price Today : గోల్డ్ ప్రియులకు ఊరట.. ఏపీ, తెలంగాణలో నేటి బంగారం, వెండి ధరలు ఇవే.. దీపావళి వేళ ..
Gold Price Today తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ..
- Harishth Thanniru
- Published On : October 16, 2025 / 01:28 PM IST
Gold Price Today
Gold Price Today : బంగారం ప్రియులకు కాస్త ఊరట లభించింది. గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ దూసుకెళ్తున్న గోల్డ్ రేటుకు తాజాగా బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు దూసుకెళ్తోంది.. సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేటు.. ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ పై 38డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,226 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు.. వెండి ధరలు కూడా తగ్గాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,18,650కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,29,440కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,800 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,29,590కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,18,650కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,29,440కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,06,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,89,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,06,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
