Gold Price Today : పసిడి ప్రియులకు పండగే.. మళ్లీ కుప్పకూలిన బంగారం.. గోల్డ్ రూ. 5 వేలకుపైగా.. వెండి ఏకంగా రూ. 20వేలు..
Gold Price Today March 23 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గోల్డ్ కొనేందుకు ఇదే సరైన సమయం. బంగారం, వెండి ధరలు మళ్లీ పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ఎంత ఉందంటే?
- Sreehari A
- Published On : March 23, 2026 / 12:35 PM IST
Gold Price Today : బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. పసిడి ప్రియులకు బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం. గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. ఆకాశమే హద్దుగా దూసుపోయిన బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి.
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పతనమవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. సోమవారం (మార్చి 23)న కూడా బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గత రెండు రోజులుగా బంగారం తగ్గుతూ వస్తూనే ఉంది. ఈ సోమవారం ఏకంగా బంగారం రూ. 5,950 తగ్గింది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తులం బంగారం రూ. 5,950 తగ్గితే, కిలో వెండి ధర మాత్రం ఈ రోజు ఏకంగా రూ. 20వేలు తగ్గింది. దాంతో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఈరోజు ఉదయం బులియన్ మార్కెట్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,40,020గా ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,28,350 వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇదే మాదిరిగా తగ్గాయి. వెండి ధర కూడా రూ. 20వేలు తగ్గింది.
మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ధర రూ. 1,40,170 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
ముంబై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.రూ.1,40,020 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.1,28,350 వద్ద ట్రేడ్ అవుతోంది.
అలాగే చెన్నై నగరంలో కూడా 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,41,280 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,500 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరల విషయానికి వస్తే.. వెండి కూడా బంగారం మాదిరిగానే తగ్గుతోంది.
సోమవారం నాడు హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.20వేలు తగ్గింది. ఉదయం 11గంటల మధ్య రూ.20వేలు తగ్గి మొత్తంగా 2,30,000 వద్ద చేరింది.
