Gold Price Today : బంగారం కొనేవారికి ఇదే బెస్ట్ టైమ్.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. వెండి రేటు ఏకంగా ఎంతంటే?
Gold Price Today : నవంబర్ 16న బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై నగరాల్లో 22, 24 క్యారెట్ల బంగారం ధరలు, కిలో వెండి తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే?
- Sreehari A
- Published on- November 16, 2026 / 10:40 AM IST
Gold Price Today : బంగారం, వెండి కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి అదిరిపోయే వార్త. గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో కనిపిస్తున్న హెచ్చుతగ్గులు కొనుగోలుదారుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా నవంబర్ 16న కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.
దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనాలని ఎదురుచూస్తున్న వారికి కొంత ఊరట లభించినట్లయింది. ముఖ్యంగా భారీగా పెట్టుబడి పెట్టి బంగారం కొనాలనుకునేవారు తాజా ధరలను ఒకసారి చెక్ చేయడం బెటర్..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు :
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బంగారం ధరలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,800గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,400 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో పసిడి ధరలు :
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,950గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,550గా ట్రేడ్ అవుతోంది.
ముంబైలో బంగారం ధరలు :
ముంబైలో కూడా బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రేట్లతో సమానంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,800 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,400గా ఉంది.
వెండి ధర ఎంతంటే? :
బంగారంతో పాటు వెండి ధరల్లోనూ భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.1,90,000 వద్ద ట్రేడవుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది.
కొనుగోలు చేసే ముందు తప్పక గుర్తుంచుకోండి.. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, ఆర్థిక పరిణామాలను బట్టి మారుతుంటాయి. బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు ఉంటాయి.
మరోవైపు బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు ప్రకటించిన ధరకు అదనంగా మేకింగ్ ఛార్జీలు, తరుగు, జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే ముందు స్థానిక నగల దుకాణంలో ఆరోజు ధరను తప్పనిసరిగా తెలుసుకోవడం ఎంతైనా మంచిది.
