×
Ad

Gold Rate In India : బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్.. త్వరలో గోల్డ్ రేటు రూ.లక్ష దిగువకు.. కారణాలు ఇవే.. మళ్లీ పాతరోజులు..

Gold rate in India : 2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు ఈ ఏడాది కూడా అదే రీతిలో దూసుకెళ్తోంది. అయితే, త్వరలో 10గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష దిగువకు చేరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Gold rate in India

  • బంగారం ప్రియులకు భారీ శుభవార్త
  • త్వరలో తులం గోల్డ్ రూ.లక్ష దిగువకు!
  • రష్యా అమెరికాతో వ్యాపారం చేసేందుకు సిద్ధమవ్వడమే కారణం

Gold Rate In India : బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. పేద, మధ్య తరగతి ప్రజలు గోల్డ్ అంటేనే భయపడే స్థాయికి ధరలు పెరిగిపోయాయి. 10గ్రాముల బంగారం రూ. 1.50లక్షలు దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు గోల్డ్ 5వేల డాలర్లు దాటేసింది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో నిపుణులు పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. త్వరలో తులం గోల్డ్ రేటు లక్ష రూపాయల కంటే తక్కువకు చేరుకుంటుందని పేర్కొంటున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

Also Read : North Korea : ఉత్తరకొరియాలో వారసత్వ యుద్ధం.. పీఠం కోసం అత్తాకోడళ్లు పోరు.. ప్రపంచాన్ని వెంటాడుతున్న భయాలేంటి ?

2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు ఈ ఏడాది కూడా అదే రీతిలో దూసుకెళ్తోంది. అయితే, ఇటీవల గోల్డ్ దూకుడుకు కాస్త బ్రేకులు పడుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో 10 గ్రాముల ధర రూ.1.80లక్షల స్థాయికి చేరింది.. కాగా గత వారంలో ఎంసీఎక్స్ బంగారం ధర రూ.1.56లక్షల (10గ్రాములు) వద్ద నిలిచింది. దీన్ని బట్టి చేస్తే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయని, బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది చివరి నాటికి 10గ్రాముల గోల్డ్ రేటు రూ.90 నుంచి రూ80వేలకు పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు.

గోల్డ్ ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రష్యా అమెరికాతో వ్యాపారం చేయడం ప్రారంభిస్తే ఇది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 5వేల డాలర్లు ఉండగా.. రాబోయే రోజుల్లో ఔన్సు గోల్డ్ 3వేల డాలర్లకు పడిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అమెరికాతో డాలర్లలో (USD) వ్యాపారం చేయడానికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. రష్యా అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలర్లతో నిర్వహిస్తే డాలర్ విలువ భారీగా పెరిగే చాన్స్ ఉంటుంది. ఈ సమయంలో కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం కొంత తగ్గిస్తాయి. ఇవన్నీ బంగారం రేటును గణనీయంగా తగ్గించడంలో దోహదపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సెబీ రిజిస్టర్డ్ మార్కెట్ నిపుణుడు అనుజ్ గుప్తా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ట్రంప్ సుంకాలను ఎదుర్కోవడానికి బంగారం కొనడం ప్రారంభించాయి. ఇది గణనీయమైన డిమాండ్, సరఫరా అసమతుల్యతను సృష్టించింది. ఈ పరిణామం బంగారం అధిక ధరలకు దారితీసింది. ముఖ్యంగా బ్రిక్స్ దేశాల కేంద్ర బ్యాంకులు దూకుడుగా బంగారాన్ని కొనసాగోళ్లు జరిపాయి. ఈ పరిణామం ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పెరగడానికి కారణమైంది. కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లలో విరామం ప్రకటిస్తే బంగారం ధరలు గణనీయంగా తగ్గుతాయని, తద్వారా 10గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష కంటే తక్కువకు పడిపోతుందని అనుజ్ గుప్తా అంచనా వేశారు.