Gold Rate Today : ఒక్కరోజులోనే గోల్డ్ ధరల్లో భారీ మార్పులు.. ఏడు రోజుల తరువాత మళ్లీ ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?
Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ కూడా బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harishth Thanniru
- Published on- October 25, 2025 / 11:11 AM IST
Gold Rates Today
Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా బంగారం ధర అకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. అయితే, గడిచిన ఏడు రోజుల్లో గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది. కానీ, మళ్లీ ఇవాళ బంగారం ధర (Gold Rates Today) భారీగా పెరిగింది.
గడిచిన ఏడు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.11వేలు తగ్గింది. అయితే, శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1250 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.1150 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 16డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,113 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,15,150కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,25,620కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,25,770కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,15,150కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,25,620కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,70,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,55,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,70,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
