Gold Rate Today : ఇదికదా కావాల్సింది.. దసరా వేళ భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్క రాత్రిలోనే మొత్తం మారిపోయింది.. వెండి ధర అయితే..
Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
- Harishth Thanniru
- Published On : October 2, 2025 / 10:46 AM IST
Gold Rate Today
Gold Rate Today : పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ గుడ్ న్యూస్. గత కొద్దిరోజులుగా గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది.. ఫలితంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తోంది. అయితే, దసరా పండుగ రోజు బంగారం ధర తగ్గింది.
గడిన వారం రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.5వేలు పెరిగింది. అయితే, వారం రోజుల తరువాత ఇవాళ బంగారం రేటు భారీగా తగ్గింది. మరోవైపు వెండి రేటు భారీగా పెరిగింది.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.550 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 500 తగ్గింది. మరోవైపు వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. దీంతో గడిచిన పది రోజుల్లో కిలో వెండిపై సుమారు రూ.18వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,08,800 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,18,690కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,18,840కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,08,800 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,18,690కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,63,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,53,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,63,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
