అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: భారీ ఆఫర్లతో పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. కొనాలనుకునేవారు ఇప్పుడే కొంటే..
సేల్ వివరాలు, బ్యాంక్ ఆఫర్లు చూడండి..

Portable Projectors: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 కొనసాగుతోంది. ఈ భారీ సేల్ ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ వంటి అనేక ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
సంప్రదాయ టీవీల నుంచి పోర్టబుల్ ప్రొజెక్టర్లకు మారాలని అనుకుంటున్న వారికి ఇది చక్కటి అవకాశం. లూమియో, పోర్ట్రానిక్స్, జెబ్రానిక్స్, వ్జాట్కో వంటి బ్రాండ్‌ల ప్రొజెక్టర్లు ఆకర్షణీయమైన ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి.
సేల్ వివరాలు, బ్యాంక్ ఆఫర్లు
అమెజాన్ గత వారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సేల్ మొదటి 48 గంటల్లోనే 380 మిలియన్ల వ్యూస్‌లను నమోదు చేసింది. దాదాపు 70 శాతం ట్రాఫిక్ భారతదేశంలోని తొమ్మిది మెట్రోపాలిటన్ నగరాల నుంచే వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ సేల్ దీపావళి వరకు కొనసాగుతుందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
డైరెక్ట్ డిస్కౌంట్‌లతో పాటు, ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి షాపింగ్ చేసే వినియోగదారులు అదనంగా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. కొనుగోళ్లను ఈఎమ్ఐ పద్ధతిలో చెల్లించాలనుకునే వారికి గరిష్ఠంగా 24 నెలల పాటు ‘నో కాస్ట్ ఈఎమ్ఐ’ సౌకర్యం కూడా ఉంది.
రూ. 30,000లోపు ఉత్తమ పోర్టబుల్ ప్రొజెక్టర్ ఆఫర్లు
మోడల్ | లిస్ట్ ధర | సేల్ ధర |
---|---|---|
లూమియో ఆర్క్ 7 | రూ. 54,999 | రూ. 32,249 |
పోర్ట్రానిక్స్ బీమ్ 440 | రూ. 19,999 | రూ. 4,740 |
వ్జాట్కో యువ గో ప్రో | రూ. 29,990 | రూ. 10,990 |
ఈ గేట్ అటమ్ 3ఎక్స్ | రూ. 21,990 | రూ. 6,590 |
జెబ్రానిక్స్ పిక్సాప్లే 24 | రూ. 31,999 | రూ. 8,280 |
ఎక్స్‌జిమి హాలో+ జిటివి | రూ. 1,99,999 | రూ. 69,999 |