Gold Rates Today: బాబోయ్.. ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన బంగారం.. ఏపీ, తెలంగాణలో తులం ఏకంగా..

Gold Rates Today: బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో అకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. తద్వారా గోల్డ్ రేటు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది.

Gold Rates Today

Gold Rates Today: బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో అకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు అందుకోలేని స్థాయికి గోల్డ్ ధరలు చేరిపోయాయి. తద్వారా దేశీయంగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా 22 క్యారట్ల బంగారం 10గ్రాముల ధర తొలిసారి రూ.లక్ష మార్కును దాటేసింది. ప్రజలు ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్నే కొనుగోలు చేస్తుంటారు. దీంతో గతంలో ఎప్పుడూలేని విధంగా 22 క్యారెట్ల గోల్డ్ రూ.లక్ష దాటడం పసిడి ప్రియులకు భారీ షాక్ అని చెప్పొచ్చు.

సోమవారం స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. మంగళవారం భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1360 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 1250 పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 20డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,655 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. సోమవారం కిలో వెండిపై వెయ్యి రూపాయలు తగ్గిన వెండి.. మంగళవారం స్థిరంగా కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,01,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,10,290కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,250 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,10,440కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,01,100 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,10,290కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,30,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,40,000కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.