Income Tax Rules 2026 : మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు.. ఈ 5 ఆదాయపు పన్ను రూల్స్ తప్పక తెలుసుకోండి!
Income Tax Rules 2026 : ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను నియమాలు మారబోతున్నాయి. క్రెడిట్ కార్డు యూజర్ల పేమెంట్లపై భారీ ప్రభావం పడనుంది. ఏయే 5 ఆదాయ పన్ను నియమాలను మారనున్నాయో చూద్దాం..
Income Tax Rules
- క్రెడిట్ కార్డు ఉన్నవారికి కొత్త టాక్స్ టెన్షన్
- కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
- ముసాయిదా ఆదాయపు పన్ను నియమాలు 2026 విడుదల
- క్రెడిట్ కార్డుల పేమెంట్లపై మారబోయే 5 పన్ను నియమాలివే
Income Tax Rules 2026 : క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు పేమెంట్ల విషయంలో ఆదాయపు పన్ను నియమాలు మారనున్నాయి. దేశంలో లక్షలాది మంది క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ నుంచి ప్రయాణం, పెద్ద ఎత్తున పేమెంట్ల వరకు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రోజువారీ ఆర్థిక జీవితంలో క్రెడిట్ కార్డులు భాగమయ్యాయి.
మీరు కూడా క్రెడిట్ కార్డు వాడేవారిలో ఒకరైతే, ఈ వార్త మీకోసమే.. ఆదాయపు పన్ను నియమాలలో కొన్ని మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త మార్పులు మీ క్రెడిట్ కార్డు లావాదేవీలు, పన్ను రికార్డులకు నేరుగా అప్లయ్ అవుతాయి. ఒకసారి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాక ఈ 5 నియమాలు లక్షలాది మందిపై నేరుగా ప్రభావం పడుతుంది. ఇంతకీ క్రెడిట్ కార్డుల పేమెంట్లపై మారబోయే 5 పన్ను నియమాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే ముసాయిదా ఆదాయపు పన్ను నియమాలు 2026 విడుదల చేసింది. తుది ఆమోదం తర్వాత వివిధ వాటాదారుల నుంచి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనుంది. ఈ నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ఆదాయపు పన్ను నియమాలు 1962 స్థానంలో ఈ చట్టం అమల్లోకి రానుంది. ఆదాయపు పన్ను ముసాయిదా నియమాలు 2026 ప్రకారం.. రూ. 10 లక్షలకు పైగా క్రెడిట్ కార్డ్ బిల్లులను క్యాష్ కాకుండా ఇతర మార్గాల ద్వారా చెల్లిస్తే బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ జారీదారు మీ ఆర్థిక డేటాను ఆదాయపు పన్ను శాఖకు రిపోర్టు చేస్తారు
క్రెడిట్ కార్డుల పేమెంట్లపై మారబోయే 5 పన్ను నియమాలివే?
1. భారీ మొత్తంలో పేమెంట్లు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లులపై మొత్తం క్యాష్ పేమెంట్లు రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఈ ఆర్థిక సమాచారం ఆదాయపు పన్ను శాఖకు రిపోర్టు అవుతుంది.
2. ఏదైనా క్యాష్ లెస్ పేమెంట్ విధానం ద్వారా రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చేస్తే బ్యాంక్ లేదా కార్డు జారీ చేసే సంస్థ ఇప్పటికీ ఆదాయపన్ను శాఖకు రిపోర్టు చేస్తుంది. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలు ఇప్పుడు మానిటరింగ్ సిస్టమ్ ఆటోమాటిక్‌గా రిజిస్టర్ అవుతాయి.
3. మరో మార్పు ఏంటంటే.. పాన్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకునేటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ను అడ్రస్ ప్రూఫ్‌గా సమర్పించవచ్చు. కానీ, 3 నెలల కన్నా పాతది కాకూడదు. పాత స్టేట్మెంట్లు ఇకపై చెల్లవు.
4. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌లను వ్యాలీడ్ ఎలక్ట్రానిక్ టాక్స్ పేమెంట్ల విధానాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆన్లైన్ సిస్టమ్ పూర్తిగా ఆధారపడే వారికి పన్ను దాఖలు చేయడం చాలా ఈజీ అవుతుంది.
5. మీ కంపెనీ అధికారిక వినియోగం కోసం మీకు క్రెడిట్ కార్డ్ జారీ చేస్తే ఆ కార్డును ఆఫీసు పనులకు మాత్రమే ఖర్చు చేయాలి. ఉదాహరణకు.. ప్రయాణ ఖర్చులు, కస్టమర్ మీటింగులు ఇతర అధికారిక అవసరాలకు ఖర్చు చేయాలి. ఈ విధమైన ఖర్చులు పూర్తిగా కంపెనీ పనులైతే వాటిపై వ్యక్తిగత ఆదాయ పన్ను పడదు. అదనంగా, క్రెడిట్ కార్డ్ కోసం అప్లయ్ చేస్తే పాన్ కార్డ్ అవసరం అవుతుంది. పాన్ లేకుండా మీరు క్రెడిట్ కార్డ్ పొందలేరు.
