Gold Silver Price Today : బంగారం ధరలు తగ్గుతున్నాయ్.. వరుసగా రెండోరోజు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
- Harish Thanniru
- Published on- May 9, 2026 / 12:39 PM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గగా.. సిల్వర్ రేటు స్థిరంగా కొనసాగుతోంది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.330 తగ్గగా, 22 క్యారట్ల బంగారంపై రూ.300 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 30 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,715 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,39,650 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,500కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,800 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,350కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,39,650 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,75,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
