Gold Silver Rate Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Silver Rate Today : మూడ్రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. అయితే, శుక్రవారం కూడా గోల్డ్, సిల్వర్ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harish Thanniru
- Updated on- June 26, 2026 / 12:22 PM IST
Gold Silver Rate Today : బంగారం, వెండి ధరల్లో నేడు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
గోల్డ్ రేటు వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చింది. మూడు రోజుల్లో 24క్యారెట్ల బంగారంపై సుమారు రూ.7వేలు తగ్గింది. మరోవైపు.. సిల్వర్ ధర కూడా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చింది. మూడ్రోజుల్లో కిలో వెండిపై రూ. 25వేలు తగ్గింది. అయితే, శుక్రవారం మాత్రం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 16డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,010 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,41,600 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,29,800 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,41,750 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,29,950 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,340కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,200 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,35,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,34,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,35,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
