FASTag Local Pass : వాహనదారులకు పండగే.. టోల్ టెన్షన్‌కు గుడ్‌బై.. FASTag లోకల్ పాస్‌తో నెలంతా ఎన్నిసార్లైనా తిరగొచ్చు..
FASTag Local Pass : ఫాస్టాగ్ వాహనదారులకు గుడ్ న్యూస్.. 121 టోల్ ప్లాజాలకు డిజిటల్ లోకల్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఒకసారి ఈ పాస్ తీసుకుంటే నెలంతా ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయొచ్చు..
- Sreehari A
- Updated on- August 19, 2026 / 03:38 PM IST
FASTag Local Pass
- వాహనదారులకు గుడ్ న్యూస్
- 121 టోల్ ప్లాజాల్లో లోకల్ పాస్ అందుబాటులోకి
- ఏపీలో 12 టోల్స్, తెలంగాణలో 3 టోల్స్
- టోల్ ప్లాజాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు
- ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయొచ్చు
FASTag Local Pass : వాహనదారులకు అదిరిపోయే వార్త.. ఈ అర్హత ఉన్న వాహనదారులు లోకల్ పాస్ తీసుకోవచ్చు. 121 టోల్ ప్లాజాలకు డిజిటల్ లోకల్ పాస్ విస్తరించారు. 20 కి.మీ పరిధిలోని అర్హత ఉన్న స్థానికులు ఆన్‌లైన్‌లో నెలవారీ పాస్‌కు అప్లయ్ చేసుకోవచ్చు.
లోకల్ వాహనదారులకు అందించే డిజిటల్ (FASTag Local Pass) సదుపాయాన్ని దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) విస్తరించింది. దాంతో ప్రతిరోజూ ఒకే టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే వాహనదారులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.
ఇకపై అర్హత ఉన్న వాహనదారులు ఆన్‌లైన్‌లోనే నెలవారీ లోకల్ పాస్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. గతంలో ఈ పాస్ కోసం టోల్ ప్లాజాకు స్వయంగా వెళ్లి అడ్రస్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్లను సమర్పించాల్సి వచ్చేది. కొత్త డిజిటల్ విధానంతో ఈ ఇబ్బందులకు చెక్ పడనుంది.
20 కిలోమీటర్ల రేంజ్ కీలకం :
అర్హత ఉన్న వాహనదారులకు టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే చాలు.. ఈ లోకల్ పాస్ కోసం అప్లయ్ చేయొచ్చు. పాస్ వచ్చాక నిబంధనల లోబడి ఆ నెలలో టోల్ ప్లాజా మీదుగా ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు.
ఇందులో భాగంగా DigiLocker, VAHAN వంటి ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో ఇంటి అడ్రస్, వాహనం, ఫాస్టాగ్ వివరాలను వెరిఫై చేస్తారు. జీఐఎస్ ఆధారిత వెరిఫికేషన్ ద్వారా రిజిస్టర్ అడ్రస్ టోల్ ప్లాజా నుంచి 20 కి.మీ రేంజ్ ఉందో లేదో కూడా చెక్ చేస్తారు.
121 టోల్ ప్లాజాలకు విస్తరణ:
ఫస్ట్ టైమ్ డిజిటల్ లోకల్ పాస్ విధానాన్ని 2026 జూలైలో ఢిల్లీలోని మండ్కా బక్కర్ వాల్ టోల్ ప్లాజా వద్ద ప్రారంభించారు. లేటెస్టుగా 121 ప్లాజాలకు ఈ సదుపాయాన్ని విస్తరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని టోల్ ప్లాజాలకు విస్తరించనున్నారు. అయితే, ప్రతి ఫాస్టాగ్ కస్టమర్లకు ఈ లోకల్ పాస్ వర్తించదు. సంబంధిత టోల్ ప్లాజా, రిజిస్టర్ అడ్రస్, వాహన వివరాలు, అర్హత నిబంధనలను ముందుగా చెక్ చేసుకోండి.
Read Also : iQOO Z11 Launch : ఐక్యూ ఫ్యాన్స్ రెడీనా.. కొత్త ఐక్యూ Z11 ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..
ఏపీలో 12 టోల్స్, తెలంగాణలో 3 టోల్ ప్లాజాలు :
టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల దగ్గరలోని నివాసులు ఈ లోకల్ పాస్ తీసుకోవచ్చు. మీ సమీపంలోని టోల్ ప్లాజా లోకల్ పాస్ లిస్టులో ఉందో లేదో ముందుగా చేసుకోవాలి. ఆ తర్వాతపై అప్లయ్ చేసుకోవాలి. ఇందుకోసం రాజ్‌మార్గ్ యాత్ర వెబ్‌సైట్లోకి వెళ్లండి. టోల్ ప్లాజాను చెక్ చేయండి. అధికారిక డేటా ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి 12 టోల్స్, తెలంగాణ నుంచి 3 టోల్ ప్లాజాలను ఎంపిక చేశారు.
రూల్స్ ప్రకారం.. ఈ లోకల్ పాస్ మీ దగ్గర ఉంటే ఎన్నిసార్లు అయినా వెళ్లిరావొచ్చు. నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. డిజిలాకర్, వాహన పోర్టల్స్ లింక్ చేశారు. ఇకపై వాహనదారు లోకల్ డేటాను కూడా వెరిఫై చేస్తారు.
వాహనదారుడి ఇల్లు టోల్ గేట్‌కి 20 కిలోమీటర్ల పరిధిలో ఉందో లేదో చెక్ చేస్తారు. జీఐఎస్ లొకేషన్ ఆధారంగా ఈ వివరాలను వెరిఫై చేస్తారు. అర్హత ఉంటేనే ఈ లోకల్ పాస్ జారీ చేస్తారు. చవకైన ధరలో నెల రోజులు ఎన్నిసార్ల అయినా తిరగవచ్చు. ఈ లోకల్ పాస్ ధర రూ.350 వరకు ఉంటుంది. రాజ్‌మార్క్ యాత్ర మొబైల్ యాప్ ద్వారా ఈ లోకల్ పాస్ తీసుకోవచ్చు.
