×
Ad

Google Pixel 10 Pro : భలే ఉంది భయ్యా ఫోన్.. ఈ గూగుల్ పిక్సెల్ 10ప్రోపై భారీ డిస్కౌంట్, ఇలాంటి డీల్ వదులుకోవద్దు

Google Pixel 10 Pro : గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ రూ. 16వేలు తగ్గింపు అందిస్తోంది. ఇలాంటి డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : December 30, 2025 / 09:18 PM IST

Google Pixel 10 Pro Sale

  • భారత మార్కెట్లో రూ.1,09,999కి లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10 ప్రో
  • అమెజాన్‌లో ప్రస్తుతం ఈ పిక్సెల్ ఫోన్ రూ.97,300కి అందుబాటులో
  • రూ.12,699 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్
  • బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా

Google Pixel 10 Pro : కొత్త పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు పిక్సెల్ అప్‌గ్రేడ్ ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. 2026 కొత్త ఏడాది డీల్స్ కోసం ఎదురు చూస్తుంటే మీకో గుడ్ న్యూస్..

గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్, పిక్సెల్ 10 ప్రో ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది. బ్యాంక్ ఆఫర్‌లతో కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌పై రూ.16వేల కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో రూ.1,09,999 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు రూ.93,600 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. చాలా ఆకర్షణీయమైన డీల్‌ అని చెప్పొచ్చు. అమెజాన్‌లో పిక్సెల్ 10 ప్రో డీల్, అన్ని వివరాలపై ఓసారి లుక్కేయండి.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధర తగ్గింపు :

భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధర రూ.1,09,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.97,300కు లిస్ట్ అయింది. రూ.12,699 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.

అలాగే, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,750 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడ్ చేయవచ్చు.

Google Pixel 10 Pro

Read Also : Vivo V60e Review : వివో క్రేజే వేరబ్బా.. ఈ వివో V60e 5G ఫోన్ ఎందుకు కొనాలి? 200MP కెమెరా, 256GB స్టోరేజ్ హైలెట్ ఫీచర్లు

పిక్సెల్ 10 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

గూగుల్ పిక్సెల్ 10 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇంకా, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది.

పిక్సెల్ 10 ప్రోకు పవర్ అందించే టెన్సర్ G5 చిప్, 16GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,870mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 10 ప్రోలో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హ్యాండ్‌సెట్‌లో 42MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.