Google Pixel 8 Discount
Google Pixel 8 Discount : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో హోలీ వచ్చేస్తోంది. పండక్కి ముందే గూగుల్ పిక్సెల్ 8పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. మీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమైతే ఈ ఫోన్ మీకోసమే. కెమెరా-సెంట్రలైజడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఈ పిక్సెల్ ఫోన్ అసలు మిస్ చేసుకోవద్దు.
Read Also : Gold Rates Today : బాబోయ్.. వచ్చేవారంలో భారీగా పెరగనున్న బంగారం ధరలు.. అదే జరిగితే చరిత్రలో ఇదే తొలిసారి..!
ఫోటోగ్రఫీకి సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ పిక్సెల్ మోడల్స్ టాప్ ప్లేసులో ఉన్నాయి. చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లు ఫొటో కెమెరాల కోసమే ఈ పిక్సెల్ ఫోన్లను తెగ కొనేస్తున్నారు. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా చాలా ఖరీదైనవి అయినప్పటికీ కొనేందుకు వెనక్కి తగ్గడం లేదు. మీరు ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 8పై భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడే ఈ పిక్సెల్ 8 ఆర్డర్ పెట్టేసుకోండి.
గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో పాటు ఆకర్షణీయమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ మాత్రమే కాదు.. మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఈ స్మార్ట్‌ఫోన్ అందిస్తుంది. ప్రస్తుతం, మీరు ఈ పిక్సెల్ ఫోన్ కొనుగోలుపై రూ. 30వేల కన్నా ఎక్కువ సేవ్ చేయొచ్చు.
గూగుల్ పిక్సెల్ 8 డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ ప్రీమియం ఫోన్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం 256జీబీ గూగుల్ పిక్సెల్ 8పై రూ.33వేలు కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.82,999కు లిస్ట్ అయింది. హోలీకి ముందుగానే 39 శాతం తగ్గింపుతో రూ.49,999 వద్ద పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ట్రేడింగ్ చేస్తే.. ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి మీరు రూ.46.350 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు రూ.20వేల ఎక్స్ఛేంజ్ వాల్యును పొందితే మాత్రం ఈ పిక్సెల్ 8ని కేవలం రూ.29,999కి సొంతం చేసుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ అద్భుతమైన అల్యూమినియం ఫ్రేమ్, పవర్‌ఫుల్ 6.2-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది. 2022లో లాంచ్ అయిన ఈ పిక్సెల్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. బాక్స్ బయట ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ టెన్సర్ G3 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ ప్రియులకు 50+ 12MP సెన్సార్‌లతో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 27W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4575mAh బ్యాటరీ ఉంది. రోజంతా ఫుల్‌గా వాడేసుకోవచ్చు.