×
Ad

Google Pixel 9 Price : బిగ్ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 9 ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి!

Google Pixel 9 Price : కొత్త పిక్సెల్ 9 ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27, 750 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ మీకోసమే

1/6
Google Pixel 9 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్. పండగ సీజన్ ముగిసినప్పటికీ కొన్ని ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ ధరకే గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం.
2/6
గత ఏడాదిలో రూ. 79,999కి లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అన్ని డిస్కౌంట్లతో కలిపి ఈ పిక్సెల్ 9 ఫోన్ రూ. 52వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
3/6
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ధర తగ్గింపు : ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 9 అసలు ధర రూ.79,999 నుంచి రూ.54,999కి తగ్గింది. యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్బీఐ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు అదనంగా రూ.2,750 తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ.52,249కి తగ్గుతుంది.
4/6
మొత్తం రూ.27,750 భారీ తగ్గింపు పొందవచ్చు. మీ పిక్సెల్ ఫోన్ మోడల్, బ్రాండ్, వర్కింగ్ కండిషన్ బట్టి ఫ్లిప్‌కార్ట్ రూ. 50,490 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ సర్వీస్ ఎంపిక చేసిన ప్రాంతాలలో 15 నిమిషాల్లోనే డోర్‌స్టెప్ డెలివరీని అందిస్తుంది.
5/6
గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు : గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 6.9-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,700 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ గూగుల్ ఇన్-హౌస్ టెన్సర్ G4 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది.
6/6
కెమెరాల విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 9లో 50MP మెయిన్ సెన్సార్ OIS, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు 10.5MP ఫ్రంట్ కెమెరా ద్వారా పొందవచ్చు. ఈ పిక్సెల్ ఫోన్ 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ అబ్సిడియన్, పింగాణీ, వింటర్‌గ్రీన్, పియోనీ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే.. గూగుల్ పిక్సెల్ 9 మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనేసుకోవచ్చు.