Google Pixel 9 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ పిక్సెల్ ఫోన్ ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు.. వదులుకోవద్దు భయ్యా..!
Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ కొంటున్నారా? రూ. 20వేలు డిస్కౌంట్‌తో లభ్యమవుతోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

Google Pixel 9 Pro XL
Google Pixel 9 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సెల్ ఫోన్ అతి తక్కువ ధరకే (Google Pixel 9 Pro XL) లభ్యమవుతోంది. ఇంత తక్కువలో పిక్సెల్ ఫోన్ వస్తుంటే అసలు మిస్ చేయొద్దు..
మీరు పిక్సెల్ ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం విజయ్ సేల్స్ గూగుల్ పిక్సెల్ 9 ప్రో XLపై రూ. 20వేలు భారీ తగ్గింపును అందిస్తోంది.
అతి చౌకైన ధరకు ప్రీమియం ఫోన్ సొంతం చేసుకోండి. ఈ అద్భుతమైన ఆఫర్ అధికారిక విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ పిక్సెల్ ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఈ డీల్ మాత్రం అసలు వదులుకోవద్దు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఎంత తొందరగా కొనేసుకుంటే అంత మంచిది.
పిక్సెల్ 9 ప్రో XL ఆఫర్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL (Google Pixel 9 Pro XL) ఫోన్ రూ.1,24,999కు లాంచ్ అయింది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో రూ.1,14,999కు లిస్ట్ అయింది.
రిటైలర్ పిక్సెల్ 9 ప్రో XLపై రూ.10వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నో-కాస్ట్ ఈఎంఐ లావాదేవీలపై భారీ తగ్గింపును అందిస్తోంది.
పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 1344×2992 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR సపోర్ట్‌ను అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 9 ప్రో XL బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరాను పొందవచ్చు. పిక్సెల్ 9 ప్రో XL టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. పిక్సెల్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5060mAh బ్యాటరీని కలిగి ఉంది.