Vivo T4 Ultra : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఖతర్నాక్ ఫీచర్లతో T4 అల్ట్రా వచ్చేస్తోందోచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo T4 Ultra : వివో T4 అల్ట్రా ఫోన్ వస్తోంది. ఈ కొత్త ఫోన్ ధర, కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లేకు సంబంధించి లేటెస్ట్ లీక్ వివరాలివే..

Vivo T4 Ultra
Vivo T4 Ultra : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వివో (Vivo T4 Ultra) ఫోన్ రానుందని ధృవీకరించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ 100X డిజిటల్ జూమ్ సపోర్టుతో ట్రిపుల్ రియర్ కెమెరాతో రానుంది. కచ్చితమైన లాంచ్ తేదీ, ఇతర వివరాలను రివీల్ చేయలేదు.
Read Also : Nadendla Manohar : ఐదేళ్లు గంజాయికి అడ్డాగా తెనాలి.. రాజకీయ లబ్ధి కోసమే జగన్ టూర్.. మంత్రి నాదెండ్ల ఫైర్..!
వివో T4 అల్ట్రా ఫోన్ బ్యాక్ సైడ్ ఓవల్ షేప్ కెమెరా మాడ్యూల్‌తో బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగి ఉండొచ్చు. గత నెలలో భారత్‌లో T4 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాగా, వివో T4 అల్ట్రా కూడా ఇదే లిస్టులో చేరనుంది. వివో T4 అల్ట్రా స్పెసిఫికేషన్లు, కెమెరాకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వివో T4 అల్ట్రా 5G డిజైన్ :
వివో T4 అల్ట్రా ఫోన్ బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగి ఉండొచ్చు. ప్లాస్టిక్, ఓవల్ షేష్ కెమెరా ఐలాండ్‌తో 3 కెమెరా సెన్సార్‌లతో పాటు ఆరా రింగ్ ఫ్లాష్‌లైట్‌ను కలిగి ఉంది. వాల్యూమ్ రాకర్ బటన్ ఫోన్ రైట్ సైడ్ ఉంటుంది.
వివో T4 అల్ట్రా 5G (Vivo T4 Ultra) స్పెసిఫికేషన్లు :
రాబోయే ఈ వివో ఫోన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా రివీల్ చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఐ కేర్ సర్టిఫికేషన్‌తో రానుంది.
వివో T4 అల్ట్రాలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్, 100X డిజిటల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉంటాయి.
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్‌సెట్ 8GB ర్యామ్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15తో ఫ్రీ లోడ్ అయి ఉండవచ్చు.
Read Also : Nara Lokesh : జగన్‌కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్.. నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు రెడీ..!
వివో T4 అల్ట్రా ధర (అంచనా) :
భారత మార్కెట్లో వివో T4 అల్ట్రా ఫోన్ ధర దాదాపు రూ.34వేలు ఉండవచ్చు. వివో T3 అల్ట్రా ఫోన్ బేస్ మోడల్ ధర రూ.31,999కు లభ్యమవుతుంది.