OPPO Smartphones : ఒప్పో ఫోన్లు భలే ఉన్నాయిగా.. అతి చౌకైన ధరకే టాప్ 3 ఫోన్లు మీకోసం.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

OPPO Smartphones : ఒప్పో ఫోన్లు కావాలా? రూ. 10వేల లోపు ధరలో టాప్ 3 ఒప్పో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

OPPO Smartphones : ఒప్పో ఫోన్లు భలే ఉన్నాయిగా.. అతి చౌకైన ధరకే టాప్ 3 ఫోన్లు మీకోసం.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

OPPO Smartphones

Updated On : June 2, 2025 / 8:23 PM IST

OPPO Smartphones : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు ఒప్పో అభిమాని అయితే ఇది మీకోసమే.. ప్రస్తుతం భారత మార్కెట్లో (OPPO Smartphones) అత్యంత సరసమైన ధరకే ఒప్పో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : సూపర్ డిస్కౌంట్ భయ్యా.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..!

కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన ఆఫర్లతో కొనుగోలు చేయొచ్చు. కేవలం రూ. 10వేల ధరకే కొనుగోలు చేయవచ్చు. టాప్ 3 ఒప్పో ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

ఒప్పో A38 :
ఈ ఒప్పో ఫోన్ 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హెలియో G80 చిప్‌సెట్, 4GB ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 1612×720 రిజల్యూషన్‌ కలిగి ఉంది.

కెమెరా విషయానికొస్తే.. 50MP బ్యాక్ ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. పవర్ విషయానికొస్తే.. 5000mAh బ్యాటరీ కూడా ఉంది. మీరు ఈ ఒప్పో A38 ఫోన్‌ ధర రూ. 9999కు కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో A17 :
ఒప్పో ఫోన్ మోడల్ మీడియాటెక్ హెలియో G35తో వస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ కలిగి ఉంది. 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. 50MP డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది.

ఫ్రంట్ సైడ్ 5MP కెమెరాను కలిగి ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. Li-Po 5000mAh పవర్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్‌ను రూ. 9490కు కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో A18 :
ఈ ఒప్పో మొబైల్ 6.56-అంగుళాల HD డిస్‌ప్లే కలిగి ఉంది. 8MP ప్రైమరీ, 5MP ఫ్రంట్ కెమెరా, 90Hz వాటర్‌డ్రాప్ డిస్‌ప్లేతో లభిస్తుంది. అదే సమయంలో, ఈ ఒప్పో ఫోన్ 5000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుంది.

Read Also : Vivo T4 Ultra : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఖతర్నాక్ ఫీచర్లతో T4 అల్ట్రా వచ్చేస్తోందోచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఈ ఒప్పో ఫోన్ రూ. 9,999కు కొనేసుకోవచ్చు. ఒప్పో ఫోన్‌లతో పాటు ఇతర ఒప్పో ఫోన్‌లను కూడా రూ. 10వేల లోపు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.