Samsung Galaxy S25 Ultra 5G : సూపర్ డిస్కౌంట్ భయ్యా.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..!
Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది.

Samsung Galaxy S25 Ultra 5G
Samsung Galaxy S25 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్. . (Samsung Galaxy S25 Ultra 5G) ఆండ్రాయిడ్ ఫోన్ కొనేవారికి ఇదే బెస్ట్ టైమ్.
అమెజాన్‌లో కస్టమర్లు లేటెస్ట్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. అన్ని ఆఫర్ల తర్వాత కస్టమర్‌లు సరికొత్త గెలాక్సీ S25 అల్ట్రాపై రూ.25,800 కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ స్టోర్‌లో రూ.1,29,999కి లాంచ్ అయిన గెలాక్సీ S25 అల్ట్రా గెలాక్సీ ఏఐ ఫీచర్లు, డిస్‌ప్లే, క్వాడ్ కెమెరా సెటప్ ఫీచర్లను అందిస్తుంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ధర :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G అసలు ధర రూ.1,29,999 ఉండగా ప్రస్తుతం రూ.1,07,400కు తగ్గింది. కస్టమర్లు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3,222 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
ఈ ఫోన్ ధర రూ.1,04,200 కన్నా ఇంకా తగ్గుతుంది. కస్టమర్లు బ్యాంక్ కార్డ్‌లతో నెలకు రూ.5,207 ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.
నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు పాత ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేయొచ్చు. వర్కింగ్ కండిషన్, మోడల్, బ్రాండ్‌ను బట్టి దాదాపు రూ. 61,500 ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. అదనపు పేమెంట్ చేస్తే శాంసంగ్ కేర్ ప్లస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ ఆప్షన్లను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G (Samsung Galaxy S25 Ultra 5G) స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల QHD+ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 12GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.
45W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతుంది. గెలాక్సీ ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది.
Read Also : Aadhaar Update : ఆధార్ ఫ్రీ అప్‌డేట్.. లాస్ట్ డేట్ ఇదే.. అప్ డేట్ చేయకపోతే..
కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 3x జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.