Aadhaar Update : ఆధార్ ఫ్రీ అప్‌డేట్.. లాస్ట్ డేట్ ఇదే.. అప్ డేట్ చేయకపోతే..
Aadhaar Update : ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాలా? ఈ నెల 14 వరకు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్‌డేట్ చేయకపోతే ఈ ప్రయోజనాలు పొందలేరు.

Aadhaar Update
Aadhaar Update : మీ ఆధార్ కార్డు ఇంకా అప్‌డేట్ చేయలేదా? జూన్ 14 లాస్ట్ డేట్.. ఈ తేదీలోగా (Aadhaar Update) ఆధార్ కార్డును వెంటనే అప్‌డేట్ చేసుకోండి.
భారతీయ పౌరులు ఇప్పుడు ఈ తేదీ వరకు తమ ఆధార్ కార్డులోని వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ అప్‌డేట్ గడువు తేదీ డిసెంబర్ 14, 2024 నుంచి పొడిగించింది.
ఆధార్ కార్డుదారులకు (myAadhaar) పోర్టల్‌లో ఐడెంటిటీ ప్రూఫ్, (PoI), అడ్రస్ ప్రూఫ్ (PoA) వంటి వ్యక్తిగతల వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు అదనంగా 6 నెలల సమయం ఇచ్చింది. జూన్ 15, 2025 నుంచి ఆఫ్‌లైన్ ఆధార్ సెంటర్లలో ఆధార్ అప్‌డేట్‌కు రూ. 50 చెల్లించాలి. ప్రస్తుత ఆఫ్‌లైన్ రుసుము మాదిరిగానే ఉంటుంది.
ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం ఆధార్ పొంది ఇప్పటివరకూ అప్‌డేట్ చేయని వారు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఆధార్ కార్డును అప్‌డేట్ చేయని పక్షంలో పాత డేటా కారణంగా ప్రభుత్వ పథక ప్రయోజనాలను పొందలేరు. అలాగే, ఆర్థికపరమైన లావాదేవీలను కూడా పూర్తి చేయలేరు.
ఆధార్ అడ్రస్ (Aadhaar Update) ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి? :
- మీ ఆధార్ డేటాను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (PoI), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (PoA) ఈజీగా అప్ డేట్ చేసుకోవచ్చు.
- myAadhaar పోర్టల్ ( https://myaadhaar.uidai.gov.in)కి వెళ్లండి.
- మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు (OTP) వస్తుంది.
- లాగిన్ కోసం ఎంటర్ చేయండి.
- మీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
- వ్యాలీడ్ డాక్యుమెంట్ల కాపీలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
- మీ రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి.
- 14-అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (URN) వస్తుంది.
- ఈ URN నెంబర్ సేవ్ చేసుకోండి.
- మీ అడ్రస్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.
ఆధార్ సెల్ఫ్-సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ విజిట్ చేయండి :
Read Also : Aadhaar Update : 10ఏళ్లుగా మీ ఆధార్ అప్‌డేట్ చేయలేదా? ఈ నెల 10వరకు ఫ్రీ.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
- myAadhaar పోర్టల్ ఓపెన్ చేయండి.
- ‘అడ్రస్ అప్‌డేట్’పై క్లిక్ చేయండి.
- మీ కొత్త అడ్రస్ ఎంటర్ చేయండి.
- అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయండి.
- మీ URN నెంబర్ సమర్పించి సేవ్ చేయండి.
- ట్రాకింగ్ కోసం URN నెంబర్ నోట్ చేసుకోండి.
- అప్రూవల్ తర్వాత అప్‌డేట్ చేసిన ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయండి.