Aadhaar Update : 10ఏళ్లుగా మీ ఆధార్ అప్‌డేట్ చేయలేదా? ఈ నెల 10వరకు ఫ్రీ.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
Aadhaar Update : ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకున్నారా? జూన్ 10లోగా అప్‌డేట్ చేసుకోండి.. ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే?

Aadhaar Update
Aadhaar Update : మీ ఆధార్ కార్డు అప్‌డేట్ చేయలేదా? 10ఏళ్లుగా ఒకసారి కూడా ఆధార్ అప్‌డేట్ చేయలేదా? అయితే, మీకు మరో అవకాశం.. ఆధార్ కార్డు ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం ఇటీవలే గడువు పొడిగించింది.
Read Also : Reliance Jio : జియో యూజర్లకు పండగే.. కొత్త గేమింగ్ ప్లాన్లు ఇవే.. జస్ట్ రూ. 48 మాత్రమే..!
ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించగా.. ఈసారి జూన్ 14 వరకు గడువు పొడిగించింది. పాత ఆధార్ కార్డ్ ఉంటే.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి.. 10 ఏళ్ల పాత ఆధార్ కార్డు అప్‌డేట్ చేయడం (UIDAI) తప్పనిసరి చేసింది.
ఆధార్‌లో ఏది ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు? :
మీ ఆధార్ కార్డులో మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు. ఫింగర్ ఫ్రింట్, ఫోటో లేదా ఐరిస్ స్కాన్ల వంటి సర్వీసుల కోసం ఆధార్ సర్వీసు సెంటర్ సందర్శించి రూ. 50 రుసుము చెల్లించాలి.
ఏ తేదీలోగా అప్‌డేట్ చేయాలంటే? :
ఆధార్ కార్డు అప్‌డేట్ చేసేందుకు చివరి తేదీ జూన్ 14, 2025. ఇప్పటికే, యూఐడీఏఐ (UIDAI) అనేకసార్లు తేదీని పొడిగించింది. మీకు రెండు వారాలకు పైగా సమయం ఉంది. ఈలోగా ఆధార్ సర్వీస్ సెంటర్‌ను విజిట్ చేసి మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు.
Read Also : Post Office Scheme : మీ జీతం పడగానే పోస్టాఫీసులో ఇలా ఇన్వెస్ట్ చేయండి.. 115 నెలల్లో ఎంత రాబడి వస్తుందంటే?
ఆధార్ కార్డు ఎలా అప్‌డేట్ చేయాలి? :
- UIDAI అధికారిక వెబ్‌సైట్ (myAadhaar)పోర్టల్‌ను విజిట్ చేయాలి.
- మీరు (https://myaadhaar.uidai.gov.in)ని కూడా విజిట్ చేయొచ్చు.
- OTP కోసం మీ ఆధార్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి.
- ‘Document Update’ఆప్షన్ క్లిక్ చేయాలి.
- ఆధార్ కార్డులో మార్పులు చేశాక రివ్యూ చేయండి.
- వ్యాలీడ్ అయ్యే డాక్యుమెంట్లను స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయాలి.
- ఆపై సబ్మిట్ చేయండి. URN రిసిప్ట్ వస్తుంది.
- మీరు URN ద్వారా అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.