Reliance Jio : జియో యూజర్లకు పండగే.. కొత్త గేమింగ్ ప్లాన్లు ఇవే.. జస్ట్ రూ. 48 మాత్రమే..!
Reliance Jio : జియో క్లౌడ్ గేమింగ్ మార్కెట్ కోసం 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ప్రారంభ ధర రూ. 48 ప్లాన్ నుంచి అందుబాటులో ఉన్నాయి.

Reliance Jio Plan
Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. క్లౌడ్ గేమింగ్ మార్కెట్ కోసం జియో కంపెనీ 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియోగేమ్స్ క్లౌడ్ ఫ్రీగా అందిస్తోంది. ఖరీదైన హార్డ్‌వేర్ లేకుండా మొబైల్, పీసీ,జియో సెట్-టాప్ బాక్స్‌లో కన్సోల్ లాంటి గేమ్‌లను యాక్సస్ చేయొచ్చు.
Read Also : Foreign Visas : ఫారెన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? భారతీయులకు కేవలం 24 గంటల్లోనే వీసాను అందించే 8 దేశాలివే..!
జియోగేమ్స్ క్లౌడ్ ఏంటి? :
క్లౌడ్ ఆధారిత గేమింగ్ సర్వీస్.. తద్వారా యూజర్లు గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే నేరుగా ఆన్‌లైన్ గేమ్‌లను ఆడవచ్చు.
సబ్‌స్క్రిప్షన్ రూ. 398తో కొత్త ప్లాన్‌లలో ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే. పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కాదని గమనించాలి.
జియో కొత్త గేమింగ్ ప్లాన్లు
రూ.48 ప్లాన్ :
గేమింగ్ వినియోగదారుల కోసం 10MB డేటా, 3 రోజుల పాటు జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్‌ను అందిస్తుంది.
రూ.98 ప్లాన్ :
7 రోజుల పాటు 10MB డేటా, గేమింగ్ యాక్సెస్‌ను అందిస్తుంది. డేటా వోచర్ ద్వారా యాక్టివ్ బేస్ ప్లాన్ పొందవచ్చు.
రూ.298 ప్లాన్ :
28 రోజుల పాటు జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్‌తో పాటు 3GB డేటాను అందిస్తుంది. డేటా వోచర్, యాక్టివ్ ప్లాన్‌తో మాత్రమే వాడుకోవచ్చు.
రూ.495 ప్లాన్ :
రోజుకు 1.5GB డేటా, 5GB బోనస్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 28 రోజుల పాటు రోజుకు 100 SMS అందిస్తుంది. ఇందులో జియోగేమ్స్ క్లౌడ్, జియోసినిమా (డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ), ఫ్యాన్ కోడ్, జియోటీవీ, జియోక్లౌడ్ యాక్సెస్ కూడా ఉంటుంది.
రూ. 545 ప్లాన్ :
అత్యంత ప్రీమియం ప్లాన్. 2GB రోజువారీ డేటా, 5GB బోనస్ డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది. మిగతా అన్ని ఫీచర్లు రూ. 495 ప్లాన్ మాదిరిగానే ఉంటాయి.
అన్ని ప్లాన్‌లు జియో వెబ్‌సైట్, యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. జియోగేమ్స్ క్లౌడ్ సౌకర్యాన్ని (jiogames.com) నుంచి పొందవచ్చు.