BigBasket : స్విగ్గీ, జొమాటోకు పోటీగా బిగ్‌బాస్కెట్.. కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. ఫుల్ డిటెయిల్స్..!

BigBasket : బెంగళూరులో స్టార్‌బక్స్, క్యూమిన్‌లతో కలిసి బిగ్‌బాస్కెట్ 10 నిమిషాల ఫుడ్ డెలివరీని ప్రారంభించింది.

BigBasket : స్విగ్గీ, జొమాటోకు పోటీగా బిగ్‌బాస్కెట్.. కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. ఫుల్ డిటెయిల్స్..!

BigBasket

Updated On : June 1, 2025 / 5:27 PM IST

BigBasket : టాటా గ్రూప్ యాజమాన్యంలోని గ్రాసరీ డెలివరీ కంపెనీ బిగ్‌బాస్కెట్‌ సర్వీసులను మరింతగా విస్తరిస్తోంది. తాజాగా ర్యాపిడ్ ఫుడ్‌ డెలివరీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఫుడ్ డెలివరీ కంపెనీలైన స్విగ్గీ, జొమాటోకు పోటీగా బిగ్‌బాస్కెట్ ఫుడ్ డెలివరీ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also : Post Office Scheme : మీ జీతం పడగానే పోస్టాఫీసులో ఇలా ఇన్వెస్ట్ చేయండి.. 115 నెలల్లో ఎంత రాబడి వస్తుందంటే?

పైలట్ ప్రాజెక్టులో భాగంగా బెంగళూరులో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో 10 నిమిషాల ఫుడ్‌ డెలివరీ సర్వీసును ప్రారంభించింది. 2025లో ఫుడ్ డెలివరీ సర్వీసులను విస్తరిస్తున్నట్లు సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరి మీనన్ ఇదివరకే ప్రకటించారు.

ప్రస్తుతం, బిగ్‌బాస్కెట్ 10 నిమిషాల ఫుడ్ డెలివరీలో భాగంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, స్టార్‌బక్స్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్ స్టార్‌బక్స్, టాటా సన్స్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL) యాజమాన్యంలోని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ క్యూమిన్ (Qmin)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

బెంగళూరులో బిగ్‌బాస్కెట్ ఫుడ్ డెలివరీ సర్వీస్ కింద కాఫీ, టీ జ్యూస్, స్నాక్స్, మీల్ బౌల్స్, డెజర్ట్‌లు వంటి పానీయాలను డెలివరీ చేయనుంది.

ఫుడ్ డెలివరీ రేస్‌లో దిగ్గజ కంపెనీలు :
క్విక్ కమర్షియల్ ప్లాట్‌ఫారంలైన జెప్టో (జెప్టో కేఫ్), స్విగ్గీ (స్నాక్), బ్లింకిట్ (బిస్ట్రో) సర్వీసులను విస్తరిస్తుండటంతో రాపిడ్ ఫుడ్ డెలివరీ విభాగానికి డిమాండ్ పెరుగుతోంది.

జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్ ఇన్-హౌస్ రాపిడ్ ఫుడ్ డెలివరీ సర్వీస్ బిస్ట్రోను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. బిస్ట్రోను ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, బెంగళూరు, ముంబై అంతటా విస్తరిస్తున్నారు.

బిస్ట్రో ఇప్పుడు ఈ మార్కెట్లలో 100 కన్నా ఎక్కువ కిచెన్‌లను నడుపుతోంది. మరోవైపు, స్విగ్గీ 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ బోల్ట్‌ (Bolt)ను విస్తరిస్తోంది.

Read Also : Aadhaar Update : 10ఏళ్లుగా మీ ఆధార్ అప్‌డేట్ చేయలేదా? ఈ నెల 10వరకు ఫ్రీ.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

లిమిటెడ్ మెనూలతో ఎంపిక చేసిన రెస్టారెంట్ పార్టనర్లకు అందిస్తోంది. 2020లో బేకరీ ఫుడ్ కోసం క్యూమిన్‌ కేఫ్‌ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.