×
Ad

Fuel Shortage Rumors : మీరే గ్యాస్ వాడుతున్నారు? గ్యాస్ కంపెనీ నుంచి మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

Fuel Shortage Rumors : మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే, అసలు నిజం తెలుసుకోండి. మీది ఏ గ్యాస్ అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలపై గ్యాస్ కంపెనీల సమాధానం ఇదే..

Fuel Shortage Rumors

  • దేశంలో ఇంధన గ్యాస్ సరఫరా కొరత నిజంగా ఉందా?
  • గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లు
  • గ్యాస్ వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన, కొరత లేదంటున్న కంపెనీలు
  • అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేసుకోవద్దంటూ సూచన

Fuel Shortage Rumors : మీరే గ్యాస్ వాడుతున్నారు? ఇటీవల మీ ఫోన్‌కు గ్యాస్ కంపెనీ నుంచి ఇలా మెసేజ్ వచ్చిందా? సోషల్ మీడియాలో దేశంలో ఇంధన కొరత.. గ్యాస్ సరఫరా తగ్గిపోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో చాలా మంది గ్యాస్ వినియోగదారులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన గ్యాస్ కంపెనీలు క్లారిటీ ఇచ్చాయి. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఇంధన కొరత వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రచారమని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించాయి.

గ్యాస్ కంపెనీల మెసేజ్ ప్రకారం.. దేశంలో గ్యాస్, ఇతర ఇంధనాల సరఫరాకు ఎలాంటి కొరత లేదు. వినియోగదారులు అసలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. సాధారణంగా ఎలా గ్యాస్ వినియోగిస్తున్నారో అలా గ్యాస్ వినియోగాన్ని కొనసాగించాలని సూచించాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సందేశాలను నమ్మి ముందుగానే ఎక్కువ సిలిండర్లు బుక్ చేయొద్దు లేదా స్టోర్ చేసుకోవడం అవసరం లేదని కూడా స్పష్టం చేశాయి.

గ్యాస్ సరఫరాకు ఎలాంటి సమస్య లేదు :
అలాగే, గ్యాస్ జాగ్రత్తగా అవసరానికి వినియోగించడం అనేది ప్రతి పౌరుడి బాధ్యతగా కంపెనీలు గుర్తుచేశాయి. గ్యాస్‌ను వృథా చేయొద్దని, అలా చేస్తే కుటుంబ ఖర్చులు తగ్గుతాయని, దేశానికి కూడా చాలా మేలు జరుగుతుందని చెబుతున్నాయి.

Read Also : Income Tax Draft Rules : కొత్త ఇన్‌కమ్ టాక్స్ డ్రాఫ్ట్‌లో భారీ ట్యాక్స్ రిలీఫ్? జీతగాళ్లకు ట్యాక్స్ బెనిఫిట్స్ డబుల్ అవుతాయా.. పూర్తి లెక్కలు ఇవే

అందుకే, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మొద్దని అధికారిక సమాచారాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నాయి. ప్రస్తుతం గ్యాస్ సరఫరాపై ఎలాంటి సమస్య లేదని గ్యాస్ కంపెనీలు స్పష్టం చేశాయి.

తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు :
మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని అసలు నమొద్దు. అనవసరంగా భయపడొద్దు. తద్వారా ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిపుణుల ప్రకారం.. ఇలాంటి పరిస్థితుల్లో అధికారిక గ్యాస్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు ప్రకటించే సమాచారం మాత్రమే నమ్మాలి. మీకు అవసరం లేకున్నా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొద్దు. అలాగే ఇంట్లో అదనంగా పెట్టుకోవద్దు.

ఇలాంటి చర్యల కారణంగా ఇతర వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. గ్యాస్ సిలిండర్ షార్టేజ్ ఏర్పడుతుంది. సాధారణంగా ఎప్పటిలాగే గ్యాస్ వినియోగాన్ని కొనసాగించండి. అలాగే గ్యాస్ జాగ్రత్తగా వినియోగించుకోవాలని కంపెనీలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం గ్యాస్ సరఫరా వ్యవస్థ సాధారణంగానే ఉంటుందని, గ్యాస్ వినియోగదారులు ఆందోళనకు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి.